ప్రతి ఒక్కరూ తమ హక్కులను వినియోగించుకోవాలి.

జనం న్యూస్ ఏప్రిల్ 30 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం ) మండల పరిధిలోని రత్నవరం గ్రామ ఎస్సీ కమిటీ హాల్ లో గురువారం పౌర హక్కుల దినోత్సవ అవగాహన సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ మన్సూర్ అలీ , ఎస్.ఐ అజయ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీను, హాస్టల్ వార్డెన్ లు హాజరై మాట్లాడారు. డా. బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన ప్రాథమిక హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, విద్య, రక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులను వినియోగించు కోవడంతో పాటు, రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలను కూడా క్రమశిక్షణతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, జి పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *