జనం న్యూస్ మధిర ఏప్రిల్ 30, దోర్నాల కృష్ణ సర్కారు బడిలో చదివే పిల్లలు అంటే సహజంగా చిన్నచూపు ఉంటుంది.. ఆశించిన ఫలితాలు సాధించలేరనే అపోహ ఉంటుంది.. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. విజయమే లక్ష్యంగా సాధన చేసిన మధిర మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 91% ఫలితాలను సాధించి భేష్ అనిపించారు. ఎక్కువ మంది విద్యార్థులు 500 కు పైగా మార్పులు సాధించి ఘనతను సాధించడం మరో విశేషం. మండలంలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 91 శాతం ఫలితాలను సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆయన అభినందించారు.మార్కులలోనూ పోటీయే..సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్తీసరు మార్కులతో గట్టెక్కే విద్యార్థులు ఎక్కువగా ఉంటారని అపోహకు కూడా ఈసారి విద్యార్థులు తెరదించారు. ఎక్కువ మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి ప్రైవేటు పాఠశాలలకు గట్టి పోటీ ఇచ్చారు. మధిర మండల పరిధిలోని మర్లపాడు హై స్కూల్ విద్యార్థిని నారెడ్ల లక్ష్మి తిరుష రెడ్డి అత్యధికంగా 573 /600 మార్కులు సాధించి మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలగా మొదటి స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ప్రైవేటు పాఠశాల తరహాలో సదుపాయాలు, సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఉన్న వనరులను ఉపయోగించుకొని చక్కగా చదివి మంచి ఫలితాలు సాధించి అందరి అభినందనలను అందుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.