దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

*నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్

జనం న్యూస్ ఏప్రిల్ 30 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం ) వేసవి కాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్సై జి. అజయ్ కుమార్ కోరారు. రైతులు తమ పొలాల వద్ద ఉండే విద్యుత్ మోటర్లు, వైర్లు, పైపులను దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని, వాటిని సురక్షితంగా ఇంటి వద్ద భద్రపరుచుకోవాలని సూచించారు. అలాగే పశువుల దొంగతనాలు జరిగే ఆస్కారం ఉన్నందున పశువుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. సెలవుల్లో పిల్లలు ఈత కోసం చెరువులు, బావులు, కాలువల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా తల్లిదండ్రులు నిరంతరం కనిపెట్టుకొని ఉండాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *