రాష్ట్రస్థాయికీ మూడు స్టడీ ప్రాజెక్టులు ఎంపిక

జనం న్యూస్/ గంభీరావుపేట 30 ఏప్రిల్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సీసీఈ వారి ఆదేశానుసారంగా జిజ్ఞాస స్టూడెంట్ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికైనాయి. ఇంగ్లీష్ ,కెమిస్ట్రీ, మరియు బోటనీ సబ్జెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీమతి.వి. విజయలక్ష్మి విద్యార్థులను అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ మూడు సబ్జెక్టులో ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో పోటీపడి ప్రథమ, ద్వితీయ, మరియు తృతీయ బహుమతులను అందుకోవటం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఇటి కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్.ఎం. ప్రభాకర్,ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్. వై.ఆంజనేయులు, ఎన్ ఎస్ ఎస్ పి ఓ పాక ధర్మపురి, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్. జె.శ్రావణ్ కుమార్, స్కాలర్షిప్ కోఆర్డినేటర్ డాక్టర్. ఎన్ ఆదివిష్ణు, డాక్టర్.కె.వి. బిక్షమయ్య, మనోహర్,శ్రీనివాస్ కృష్ణ ప్రసాద్ మహేష్, భార్గవి, దీపిక, తదితర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *