జనం న్యూస్ 30 ఏప్రిల్ 2026 బండి ఆత్మకూరు మండలం,శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండల కేంద్రంలో గురువారం నాడు వర్కింగ్ జర్నలిస్టులు చిత్తూరు జిల్లా వీ.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్యకు కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేసి మండల తహసీల్దార్ పద్మావతి కి వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ… జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. హత్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.తహసీల్దార్ పద్మావతి వినతి పత్రాన్ని స్వీకరించి, ఉన్నతాధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ విలేకరులు పాల్గొన్నారు.