100 రోజుల సంకల్పం! మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు

జనం న్యూస్ మే1 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు 100 రోజుల మారకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సును మండలంలో చినపాచీల గ్రామంలో గురువారం రావికమతం ఎస్ఐ రఘువర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వికసిత్తు భారత్ జిరాంజీ శ్రామికులు, మరియు గ్రామంలో గల యువతతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎస్సై రఘువర్మ మాట్లాడుతూ వేసవికాలం దృశ్య గ్రామాలలో, పట్టణాలలో దొంగ దొంగతనాలు, మహిళలు మరియు పిల్లల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మారకద్రవ్యాల నిర్మూలన, టోల్ ఫ్రీ నెంబర్ 1972, గురించి ప్రజలకు విపులంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పోక్సో చట్టం, ఎన్ డి పి ఎస్ చట్టం, న్యాయ పరిరక్షణ ప్రాధాన్యత, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్లైన్ బెట్టింగ్, నకిలీ లోను యాప్స్, అనుమానాస్పద లింకుల నుంచి దూరంగా ఉండే విధానాల పైన చర్చించి పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియపరచడం జరిగిందన్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఏ విషయంలోనూ ఎక్కడ ఎవరి వద్దను మోసపోకూడదని, అనుమానాస్పద పరిస్థితులు కనిపించినట్లయితే తక్షణమే పోలీసులను సంప్రదించాలని, ఆయన సూచించారు. వేసవి కాలం దృశ్య అధిక సంఖ్యలో ఇల్లలకు తాళాలు వేసుకొని విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నందున అటువంటివారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియపరిచారు. అటువంటి వారి ఇళ్లలో ఎక్కువగా చోరీలు, దొంగతనాలు జరిగే ప్రమాదం ఉన్నందున మందస్తుగా సమాచారాన్ని తెలియపరచిన తదుపరి వెళ్లాలన్నారు .అలాగే చిన్న పిల్లలు, టెన్త్,ఇంటర్ యువకులు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు బీచ్లు, సముద్రాలు, బావులు, డ్యాములు వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *