జనం న్యూస్/మే 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల వేలేరుపాడు మండలం వేలేరుపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ లీడర్ కురిమెళ్ళ సుధాకర్ ఇటీవల మరణించినారు.నేడు వారి స్వగ్రామానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ &ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు అమరావరపు అశోక్, కరటూరి రాధాకృష్ణ, శాఖమూరి సంజీవులు, కోటిపల్లి ముత్యాలరావు, చాపర్ల శ్రీను,కొమ్మన వెంకటేశ్వరరావు, కట్ట రాంబాబు,ఎం.డి సలీమ్,అమరావరపు వెంకన్న, పసుపులేటి లక్షమయ్య, పద్దం రమేష్, బిరం అంజి,చిట్టిపోతుల పోసి తదితరులు పాల్గొన్నారు.