జనం న్యూస్ మే 1 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారంరోజు జాయింట్ కలెక్టర్ ని కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు భారీగా పాల్గొని వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు పేర్కొన్న విషయాలు: ఫేషియల్ అటెండెన్స్ వల్ల గ్రామీణ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనాలు ఆలస్యమవుతున్నాయి
పేద కూలీల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతోంది ప్రధాన డిమాండ్: వెంటనే ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేసి, పాత హాజరు విధానాన్ని పునరుద్ధరించాలి పాల్గొన్న ముఖ్య నాయకులు బి. లక్ష్మణ్ – రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ కార్యదర్శి •కమ్మిడి అశోక్ – ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాంగి అనిల్ – వైసీపీ అధ్యక్షులు, హుకుంపేట మండలం స్వాబి రామూర్తి – వైసీపీ అధ్యక్షులు, అరకువాలీ మండలం పాంగి పరశురామ్ – వైసీపీ అధ్యక్షులు, డుంబ్రిగుడ మండలంపాంగి నాగేశ్వరావు – ఎస్టీ సెల్ అధ్యక్షులు, అరకువాలీ మండలం •కొర్ర అర్జున్ రావు – సుంకర మెట్ట పంచాయతీ అధ్యక్షులు కమ్మిడి విజయదశమి – యువజన విభాగం అధ్యక్షులు, డుంబ్రిగుడ మండలం గ్రామీణ కూలీల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు.