జనం న్యూస్ ఏప్రిల్ 30 కోటబొమ్మాళి మండలం :స్థానిక శ్రీ కొత్తమ్మ తల్లి దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు దాతలు మరింత ముందుకు రావాలని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోరాడ గోవిందరావు కోరారు. గురువారం దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులకు భోజనాలు అందించారు.ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ, రోజురోజుకీ అమ్మవారి దర్శనార్థం భక్తుల రద్దీ పెరుగుతోందని, భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటు న్నారని తెలిపారు. దేవాలయం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రాధాకృష్ణ, కమిటీ సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.