జనం న్యూస్ మే1 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు మండలంలో మరుపాక ఆదర్శ పాఠశాల విద్యార్ధి 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మండల స్థాయిలో సత్తా చాటాడు. మరుపాక మోడల్ స్కూలుకు చెందిన బేరా సతీష్ 585 మార్కులు సాధించి మండలంలో టాపర్గా నిలిచాడు. మండలంలో 729 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు లో పాల్గొనగా వీరిలో 651 మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. వీరిలో సతీష్ 585 మార్కులు సాధించి మండలంలోని ప్రథమ స్థానంలో నిలిచాడు. మరుపాక మోడల్ స్కూల్లో 50 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు పొందారు దీంతో పాఠశాల 98% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కే. సత్య సునీల్ తెలిపారు. మండల లో ప్రథమ స్థానంలో నిలిచిన సతీష్ ను ప్రిన్సిపాల్ కె సత్య సునీల్ ,పాఠశాల చైర్మన్ కాశెట్టి రాజు, విద్యార్థి తల్లి దండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది పలువురు ఆయనను అభినందించారు.