నాయి బ్రాహ్మణులకు అట్రాసిటి చట్టం వర్తింప జేయాలని పొన్నం ప్రభాకర్ కు వినతి:స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకటస్వామి

జనం న్యూస్ 30 ఏప్రిల్ 2026 (కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య) కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకటస్వామి ఆధ్వర్యములో రాష్ట్ర రవాణా శాఖ & బి.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అదించడం జరింగింది. విన్నపం కరీంనగర్లో ఏప్రిల్ 25, 2026 ఉదయం 7:30 గంటలకు న్యూ ప్రజా హెయిర్ స్టైల్స్ సెలూన్ నిర్వాహకుడు పగడాల రాము (50) షాపును శుభ్రం చేస్తున్నాడు ఈ సమయంలో కరీంనగర్ త్రీ టౌన్ ఎస్.ఐ ఎన్ చైతన్య చందర్ సెలూన్ షాప్ కి వచ్చాడు షాప్ శుభ్రం చేస్తున్న పడాల రాము అన్న కొద్దిసేపు కూర్చోండి అని అన్నారు కాసేపు ఆగమంటావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్.ఐ నానా బూతులు తిట్టుకుంటూ శౌరవృత్తిదారుడైన పగడాల రాముని తిట్టడమే కాకుండా చెంపపై రెండు దెబ్బలు వేయడం జరిగినది ఈతతంగమంతా సెలూన్ లో ఉన్న సిసిటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ సంఘటనపై బాధితుడు పగడాల రాము త్రీ టౌన్ లో తనపై అకారణంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ చేయి చేసుకున్న ఎస్.ఐపై చర్య తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే విచారణ జరిపి పగడాల రాముపై దాడి చేసిన ఎస్ఐ చైతన్య చందర్ ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు పగడాల రాముకు మద్దతుగా ఆందోళన చేపట్టి అండగా నిలిచారు పగడాల రాముకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని నాయి బ్రాహ్మణులు తమ ఐక్యతను చాటారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటి యాక్ట్ జీవో ఇవ్వాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో బ్యాక్ వరల్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జి.ఓ.యం.యస్. No.50, తేది:07/08/2022 విడుదల చేయడం జరిగినది ఈ జీవో ప్రకారం ఏపీలోని నాయి బ్రాహ్మణుల పట్ల అసభ్యకరంగా మంగలి, మంగలోడ, మంగల్ది బొచ్చు గొరిగేటోడా, కొండ మంగలోడా అని నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకునే విధంగా. జి.ఓ.యం. యస్. నెం.50 ఉపయోగపడుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు రక్షణ కల్పించే విధంగా జీ.వో ఇవ్వాలని కోరుచున్నాము. రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు అసెంబ్లీలో చర్చించి నాయి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తినకుండా నాయి బ్రాహ్మణులకు రక్షణ కవచంగా ఈ జీ.వో ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రికమండ్ చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమము లో అవుదుర్తి విజయ్ కుమార్. శ్రీరాముల బాల సురేందర్. గర్షకుర్తి రాజు తదిత తదితరులు పాల్గొని మెమోరాండం అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *