వి ఓ ఏ లకు నీరు, పారిశుధ్యం పరిశుభ్రత పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం

జనం న్యూస్1.5.2026, మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్.జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం. మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సిబ్బంది అయిన ‘ విలేజ్ ఆర్గనైజషన్ అసిస్టెంట్స్ ‘ ఓబీ ల కోసం నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిక్షణలో సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, మరుగుదొడ్ల వినియోగం, ఇంటి పరిసరాల పరిశుభ్రత ఘన వ్యర్థాల నిర్వహణ వంటి ముఖ్య అంశాలపై విపులంగా చర్చ జరిగింది.మహిళా అభివృద్ధి సంస్థ తరపున వాష్ తెలంగాణ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బ్రహ్మచారి పాల్గొని, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ప్రాముఖ్యతపై వివరించారు. మంచి నీటి మూలాల వినియోగం, చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యత, ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో సూచనలు అందించారు. అప్మాస్ సంస్థ ద్వారా ఆర్వో వాటర్ ప్లాంట్ మహిళా సభ్యులు పెట్టుకుంటే రెండు లక్షల రూపాయలు సబ్సిడీ మరియు కమ్యూనిటీ బోర్ వెల్ వేసుకున్నా వారికి 25 వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీమతి అనిత మాట్లాడుతూ గ్రామాల్లో శుభ్రతపై అవగాహన పెంపొందించడం వి ఓ ఏ స్ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రతి కుటుంబానికి సమయానికి సరైన సమాచారం అందించడంతో పాటు, ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. అదేవిధంగా, ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామస్థాయిలో అమలు చేయాలని సంఘాల ద్వారా ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని అప్మాస్ ప్రతినిధులు సూచించారు. ఏపీఎం దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంఘ సమావేశంలో వాష్ అంశాన్ని ఒక ముఖ్య అజెండాగా చేర్చి, ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వి ఓ ఏ ఎస్ ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొంటూ, ఈ అంశాలను గ్రామస్థాయిలో అమలు చేసి కుటుంబాల ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు కృషి చేస్తామని తెలిపారు. శిక్షణను నిర్వహించిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో (సీసీలు), మండల సమాఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *