ఈసారి కూడా పది ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన మన్యం జిల్లా

*డీఈవో బ్రహ్మాజీ

జనం న్యూస్, మన్యం జిల్లా, సాలూరు, మే 1. రాష్ట్రంలో గత మూడు సంవత్సరముల నుండి పదవ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధిస్తున్న మన్యం జిల్లా విద్యార్థులు ఈ సంవత్సరం కూడా పది ఫలితాల్లో తమ సత్తాను చూపి నాల్గవసారి కూడా మన్యం జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ జిల్లా నుండి 10,506 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా అందులో10092 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. కేవలం 414 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. జిల్లాలో బాలురు95.58% బాలికలు 96.54% తో మొత్తంగా 96.7%తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించారు. ఇందుకు కారణమైన గౌరవ జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి నిరంతర విద్యపై పర్యవేక్షణ మరియు సూచనలు ఫలితంగా మన్యం జిల్లా పది ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని డీఈవో తెలియజేశారు. ఎంతటి ఘన విజయానికి కారకులైన ఎంఈఓ లకు, హెడ్మాస్టర్లకు, బోధనా సిబ్బందికి డీఈవో ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు కూడా విడుదలైందని మే 25 నుంచి జూన్ 2 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మే 25న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, 26న సెకండ్ లాంగ్వేజ్ హిందీ, 28న ఇంగ్లీష్, 29న మ్యాథ్స్, 30న ఫిజిక్స్, జూన్ 1న బయాలజీ, జూన్ 2న సోషల్ ఎగ్జామ్స్ జరుగు తాయని, ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని, ఫిజిక్స్ బయాలజీ ఎగ్జామ్స్ మాత్రం ఉదయం 9:30 నుండి 11:30 వరకు జరుగుతాయని మన్యం జిల్లా డీఈవో బ్రహ్మాజీ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *