బిజినపల్లిలో పదో తరగతి టాపర్లకు ఘన సత్కారం

*సన్మాన కార్యక్రమంలో తాసిల్దార్ ఎండీ మునీరుద్దీన్ ఎంఈవో టి తిరుపతయ్య

జనం న్యూస్ మే 01 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో మండల విద్యా వనరుల కేంద్రం బిజినపల్లి వేదికగా నిన్న వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నేడు ఘనంగా సత్కరించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బిజినపల్లి తహసీల్దార్ ఎండీ మునురుద్దీన్ శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను మండల విద్యాధికారి టి. తిరుపతయ్య శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మునిరోద్దీన్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇప్పటి విజయాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా ఉన్నత లక్ష్యాలు సాధించాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *