బిజినపల్లి మండలంలో మెరిసిన అలకనంద: 580 మార్కులతో ఘన సన్మానం

*సన్మానిస్తున్న మాజీ సర్పంచ్ దేవరకొండ రామచందర్

జనం న్యూస్ మే 01 ప్రతినిధి ఎండీ జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి, మండలంలో ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో పాలెం శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం దక్కించుకున్న దళిత బాలిక బోనాసి అలక నందను బిజినపల్లి అంబేద్కర్ మండల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు అలకనందకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే పట్టుదలతో సాధించిన ఈ విజయం అందరికీ ఆదర్శమని కొనియాడారు. గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ రామచందర్ (మాజీ సర్పంచ్, గుడ్లనర్వ) మాట్లాడుతూ, అలకనంద వంటి విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బోనాసి పెద్ద కురుమయ్య, ఫర్టిలైజర్ రామకృష్ణ, బోనాసి బాలకృష్ణ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *