జనం న్యూస్ ఏప్రిల్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ గాధ గ్రామంలో నూతన గృహప్రవేశం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చేయడం జరిగిందని, ప్రభుత్వం చేస్తున్న పనులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు.మెచ్చే మంచి పనులు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు, తేదీ 30 4 2026 గురువారం రోజున శ్రీవాద గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాన్ని పర్ష హన్మాండ్లు ప్రారంభించారు, ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ
పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయని, అర్హులకే ప్రభుత్వ పథకాలు అందుతాయని పైరవీలకు ఎలాంటి ఆస్కారం లేదని పర్ష హన్మాండ్లు అన్నారు, సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సహకారం అవుతుందని అందుకు నిదర్శనమే అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అని పర్ష హన్మాండ్లు అన్నారు, రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతల మంజూరు అయినాయని ప్రత్యేకంగా కొన్ని మంజూరు అవుతున్నాయని, రెండో విడతలో మరో నాలుగు లక్షల ఇండ్లు మంజూరు కాబోతున్నాయని పర్ష హన్మాండ్లు అన్నారు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ,200 యూనిట్ల లోపు వరకు ఉచిత కరెంటు బిల్లు, తెల్ల రేషన్ కార్డుల మంజూరు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ఇక మిగిలింది కొత్త పెన్షన్స్ అని అవి కూడా లక్ష మందికి కొత్త పెన్షన్స్ మంజూరు కానున్నట్టు పర్ష హన్మాండ్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సుద్దాల అనిత గణేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బందెల రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు వేముల శ్రీనివాస్ గౌడ్, నాయకులు పర్ష శ్రీనివాస్, గౌరినేని శ్రావణ్ రావు,వేముల యాద గౌడ్, కత్తుల బాబు, పర్ష నరసింహులు, సుద్దాల గణేష్, సుద్దాల అనిత, సుద్దాల బుచ్చమ్మ, సుద్దాల మల్లేశం, సుద్దాల అజయ్, సుద్దాల రాము తదితరులు పాల్గొన్నారు.
