జనం న్యూస్ 30 ఏప్రియల్ 2026 బండి ఆత్మకూరు మండలం శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్ష ఫలితాలు గురువారం నాడు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మండల విద్యాధికారులు యశోద, మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో బాలికలే పై చేయి సాధించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మండల టాపర్ గా ఏపీ మోడల్ స్కూల్ దాసరి త్రివేణి 583/600 ఈర్నపాడు హై స్కూల్ ఏ. సమీర్ 582/600 మార్కులు సాధించా రని తెలియజేశారు.. ఈ సందర్భంగా మండల విద్యాధికారులు యశోద, మోహన్ రెడ్డి,ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రఫీ, ఆదర్శ పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ ఆకుమల్ల రమేష్ యాదవ్ దాసరి త్రివేణి విద్యార్థినికి అభినందనలు తెలిపారు..
