వివాహ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

జనం న్యూస్  , ఏప్రిల్ 30 రొంపిచర్ల మండలం, రిపోర్టర్  భీమనేని బాలకృష్ణ, రొంపిచెర్ల మండలం పెద్దగొట్టి గల్లు గ్రామంలోని వీఎంఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన వివాహ వేడుకలకు మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కోట వెంకటరమణ, కోట లక్ష్మీకాంత దంపతుల కుమార్తె కోటా సుష్మ, చామంతుల వీరప్ప, చామంతుల నాగమ్మల కుమారుడు చామంతుల కృష్ణ మహేష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన వధూవరులు  కోటా సుష్మ, చామంతుల కృష్ణ మహేష్ లను ఆశీర్వదిస్తూ, సుఖసంతోషాలతో పిల్లాపాపలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలకు విచ్చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రెడ్డిశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ విజయశేఖర్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరీముల్లా, నాయకులు సూర్యనారాయణ రెడ్డి, శ్రీనాథ్ నాయుడు, అల్లాబక్షు, మహబూబ్ బాషా, ప్రేమానందం, నీరజాక్షులు, సురేంద్ర, సైఫుల్లా ఖాన్, ఓబులేసు, అమరనాథ్ రెడ్డి, రమణ, మునిక్రిష్ణా రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *