పది ఫలితాల్లో సత్తాచూపిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు

జనం న్యూస్, మన్యం జిల్లా, సాలూరు, మే 1. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం లోనూ, అత్యధిక మార్కులు సాధించడంలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ముందున్నారని పది ఫలితాల వలన తేటతెల్లమైనది. సాలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన నడు పూరి మౌనిక కు 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి సాలూరు పట్టణము మరియు సాలూరు మండలానికి ప్రథమ స్థానంలోనూ, మన్యం జిల్లాలో రెండవ స్థానంలో నిలిచింది. అలాగే KANM గాడివీది హై స్కూలుకు చెందిన కొల్లి నందిని 600 మార్కులు గాను 589 మార్కులు సాధించి రెండు స్థానంలో నిలిచింది. ఇలా పది ఫలితాల్లో సాలూరు పట్టణము మరియు మండలంలో 500కు పైగా మార్కులు సాధించిన వారు 250 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. పది ఫలితాల్లో ఎక్కువ మార్కులు సాధించి సత్తా చూపిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని తేటతెల్లమైనది. పది ఫలితాల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వారి ఇళ్లకు వెళ్లి స్వీట్లు తినిపించారు. ఈ సంఘటన చూసిన పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *