పది ఫలితాల్లో మండల టాపర్ షేక్.అత్తర్ రవాఫ్

 జనం న్యూస్ ఏప్రిల్ 30, సుండుపల్లి మండలం, వైస్సార్ కడప జిల్లా :(రిపోర్టార్ :జి. ప్రవీణ్ కుమార్ ):  మండల పరిధిలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 30వ తేదీ వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండల టాపర్ గా షేక్.అత్తార్ రవాఫ్ 600/585 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారాని కరస్పాండెంట్ నాగేశ్వరరావు తెలియజేశారు. అలాగే ఎస్.నవ్యశ్రీ 548, ఆర్ .కావ్య శ్రీ 546 మార్కుల తో విజయం సాధించాలని  వీరిని డైరెక్టర్ వెంకట వ్యాదవ్యాస్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందిం చారని తెలియజేసారు. అలాగే గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల నందు 27 మంది పరీక్షలు రాయగా 23 మంది ఉత్తీర్ణత ప్రధమశ్రేణి 21 మంది ద్వితీయ శ్రేణి 2 పాసైనట్లు మొత్తానికి 85% వచ్చినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర నాయుడు తెలిపారు.ఏం ఇ ఒ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ మొత్తం 473 మంది పరీక్షలు రాయగా 422 మంది ఉత్తీర్ణత సాధించారని మండలంలో 89% వచ్చిందని వై వై ఆర్ రాయవరం, గుంతరాచపల్లి జిల్లా పరిషద్ పాఠశాల,వశిష్ట, మాధురి, విజేత పాఠశాల లు 100% విజయం సాధించాయని ఆయన తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *