వ్యవసాయ మోటార్ల చోరీ దొరికిన దొంగలు.

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ ఏప్రియల్ 30 తేది 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. గుడిపల్లి మండలం లోని పోలీసు స్టేషన్ లో దేవరకొండ డి ఎస్ పీ శ్రీనివాసరావు దొంగల వివరాలు వెల్లడించారు. ఎస్ ఎల్ బి సి కెనాల్ లో రైతులు మోటార్లు బిగించి వ్యవసాయ చేసుకుంటున్నారు.గుడిపల్లి మండలం లోని అంజనాపురం గ్రామానికి చెందిన చంద్రవంక చంద్రయ్యా, సురబోయిన గిరి, భైరవ కొండలు ముగ్గురు ముఠాగా కలిసి మోటార్లు దొంగిలించారు ఎలా వచ్చిన డబ్బును జల్సాలకి ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఘనపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి తన మోటారు కనిపించడం లేదు అని పోలీసు అధికారులు కి చెప్పాడు. ఈ ముగ్గురు మోటార్లు దొంగిలించి ఒక షాపు లో విక్రయానికి పెట్టారు.అది చూసిన షాప్ యజమాని రైతులకి తను అల్లిన మోటార్ అని తెలియపరిచాడు,వారి వచ్చి పోలీస్ పిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని స్టేషన్ కి తరలించి మోటార్లు కూడా సేకరించారు. సుమారు పద్నాలుగు మోటార్లు దొంగిలించారు. కేసు నమోదు చేశారు. మోటార్లు దొంగిలించమని ముఠా సభ్యులు చెప్పారు. వీటి విలువ ఐదు లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ముఠా సభ్యులని పట్టుకున్న పోలీస్ సిబ్బంది కరుణాకర్, ఏడుకొండలు, శేఖర్ ను డి ఎస్ పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *