పల్లెల్లో వెలసిన విద్య కుసుమాలు

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ ఏప్రిల్ 30, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్ రావు పెట్ గ్రామంలో గుండేటి మణిదీప్ పదవ తరగతిలో 600 మార్కులకు గాను 567 మార్కులు సాధించి కొడిమ్యాల మండలంలో రెండవ స్థానంలో నిలిచాడు సలేంద్ర రేవతి ఇంటర్ ప్రథమ సంవత్సరం లో తాటి పెళ్లి గురుకుల పాఠశాలలో చదివి 479 మార్కులు సాధించింది ఈ విషయం తెలుసుకున్న కొడిమ్యాల మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు వారిని శాలువాతో సత్కరించారు కృష్ణారావు మాట్లాడుతూ ఇద్దరి కుటుంబం పేద కుటుంబాలు వీరి తండ్రులు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లారని వీరికి ఒక గుంట భూమి కూడా లేదని అయినా కూడా పిల్లలను కష్టపడి విద్యావంతులుగా తీర్చి దిద్దారని కొనియాడారు హిమ్మత్రావుపేట్ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చి ఇంకా ఎన్నో ఉన్నత విద్య అభ్యసించాలని విద్యార్థులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పునుగోటి కృష్ణారావు ఆకునూరి మల్లయ్య పడిగల నరసయ్య వేముల రమేష్ మల్లేశం శెట్ పెళ్లి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *