పదో తరగతి ఫలితాల్లో వజ్రకరూరు మండల టాపర్గా వి.పల్లవి

జనం న్యూస్ మే 1(రిపోర్టర్ రాజు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి,ఈ సందర్భంగా మండల విద్యాధికారులు ఎర్రిస్వామి, తిమ్మప్ప తెలిపిన వివరాల మేరకు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల టాపరుగా వజ్రకరూరు మండలం కొనకొండ్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని వి.పల్లవి పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 569 మార్కులు సాధించి మండల ప్రథమ టాపర్గా నిలిచింది,వజ్రకరూరు మండలం ద్వితీయ టాపర్గా కొనకొండ్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని మైనాహజ్ 600 మార్కులు గాను 566 సాధించారు,మండలం తృతీయ టాపర్గా వజ్రకరూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి నందకిషోర్ 600 మార్కులు గాను 560 మార్కులు సాధించారని తెలియజేశారు,ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ వజ్రకరూరు మండలం మొత్తం 551 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 338 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు,మండలం మొత్తం 61% ఉత్తీర్ణతలో నిలిచిందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *