జెడ్‌ పీ హెచ్‌ ఎస్ మేడిపల్లి నక్కర్త విద్యార్థు మార్కుల ప్రభంజనం

జనం న్యూస్ ప్రతినిధి, 30 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : మేడిపల్లి నక్కర్త, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ( జడ్.పి.హెచ్.ఎస్ ) మెడిపల్లి నక్కర్త విద్యార్థులు ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి ( ఎస్ ఎస్ సి ) పరీక్షల్లో అద్భుత ఫలితాలను సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారు. ప్రతిభ, పట్టుదల, క్రమశిక్షణతో చదివిన విద్యార్థులు అగ్రస్థానాలు సాధించి గ్రామం, మండలం గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల విజయాన్ని హర్షిస్తూ అభినందనలు తెలిపారు. తల్లి దండ్రులు, గ్రామ ప్రజలు కూడా విద్యార్థుల ప్రతిభను కొనియాడుతున్నారు. టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు 1వ ర్యాంక్: గోదాసు సుష్మ – 559/600, 2వ ర్యాంక్: ఏ. మణి చందన – , 42/600, 3వ ర్యాంక్: ఐ. కార్తిక్ – 530/600, ఇతర టాపర్స్ జాబితా గోదాసు సుష్మ – 559/600, ఏ. మణిచందన – 542/600, ఐ. కార్తిక్ – 530/600, జి. సంగీత – 528/600, ఏ. మణి సాయి – 527/600, బి. గౌతమి – 523/600, ఎస్. సమ్రీన్ – 518/600
బి. వైష్ణవి – 502/600, పాఠశాల ప్రతిష్ట మరింత పెరిగింది. ఈ ఫలితాలతో జడ్.పి.హెచ్.ఎస్ మెడిపల్లి నక్కర్త పాఠశాల విద్యా ప్రమాణాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ, మంచి బోధన, విద్యార్థుల కృషి వల్ల ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి. ఉపాధ్యాయుల కృషికి అభినందనలు విద్యార్థుల విజయానికి ప్రధాన కారణం ఉపాధ్యాయుల నిరంతర శ్రమ, మార్గదర్శకత్వం. పరీక్షల ముందు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు సహకరించారు. తల్లిదండ్రుల ఆనందం
తమ పిల్లలు మంచి మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. “కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది” అని ఈ విద్యార్థులు మరోసారి నిరూపించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా అన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ… వారికి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *