జనం న్యూస్, ఏప్రిల్ 30 (కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్రే షైనీ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. ఇంటర్ బైపీసీ విభాగంలో 961 మార్కులు సాధించి మెరిసింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ సతీష్ ఆమెను ఘనంగా సన్మానించారు. శాలువాతో గౌరవించి అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదల ఉంటే విద్యార్థులు గొప్ప విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.షైనీ విజయం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు తెలిపారు. కుమార్తె విజయంపై తండ్రి సాయిలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమె కృషి ఫలించిందని గర్వంగా తెలిపారు.ఈ విజయంతో మల్లారెడ్డిపల్లి గ్రామం గర్వపడుతోంది. షైనీ సాధించిన ఫలితం గ్రామానికి గౌరవం తెచ్చింది.
