జమ్మికుంట రూరల్ సీఐగా పులి వెంకట్ బాధ్యతలు

జనం న్యూస్, ఏప్రిల్ 30( కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) జమ్మికుంట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా గురువారం పులి వెంకట్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఐ పులి వెంకట్ మాట్లాడుతూ, రూరల్ పరిధిలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. స్థానిక అధికారులు, పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *