జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ మే 1, మండల విద్యాశాఖ అధికారిగా వై సూర్యనారాయణ ఏప్రిల్ 30 న పదవీ విరమణ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పి. రామలక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులతో ఎంఈఓ వై సూర్యనారాయణకు గురువారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.