పదిలో సత్తా చాటిన విద్యార్థులు

జనం న్యూస్ ఏప్రిల్ 30 కోటబొమ్మాళి మండలం :గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ఫలితాలు సాధించారు.స్థానిక శ్రీ నలంద పాఠశాలకు చెందిన మంచాల గ్రహీత 593/600 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం, జిల్లాలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఆమెకు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.అలాగే స్థానిక మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాలకు చెందిన డి. హేమంత్ 587/600 మార్కులతో ద్వితీయ స్థానం సాధించాడు. మండలం కురుడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన జోగు గౌతమి 586/600 మార్కులు, స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన సింహాద్రి పావని 586/600 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన నక్క లావణ్య 585/600 మార్కులు సాధించి తృతీయ స్థానం పొందింది.ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మండల విద్యాశాఖాధికారి డబ్బీరు గోవిందరావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *