జనంన్యూస్ మే 01 ఎలిగేడు మండలం, గురువారం రోజున రాములపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మేల్యే విజయరమణా రావు గ్రామ సర్పంచ్ సిద్ధి తిరుపతి యాదవ్ తో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నారు రైతులు మద్య దళారులను నమ్మి మోసాలకు గురి కారాదు అని తెలిపారు ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ సిద్ధి తిరుపతి యాదవ్ ,మండల పార్టీ అధ్యక్షులు సామ రాజేశ్వర రెడ్డి ,రాష్ట్ర యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు సంతోష్ రావు ,సుల్తానా పూర్ మాజీ గ్రామ సర్పంచ్ వేంకటేశ్వర రావు ,ఎలిగేడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ వేంకటేశ్వర రావు ,ఉప సర్పంచ్ విద్యాలత విజయ్ ,వార్డు సభ్యులు తిరుపతి ,సందీప్ ,శృతి సంపత్ ,సింధూ పర్షరామ్ ,రైతులు పొట్టల రమేష్ ,సంజీవ రెడ్డి ,జంగయ్య,సీతారామ్ రెడ్డి ,బండి కొమురయ్య ,సురేష్ ,శ్రీకాంత్ రెడ్డి ,సీ ఈ వో విక్రమ్ ,వ్యవసాయ అధికారి ఉమాపతి రెడ్డి ,ఏ ఈ వో సురేష్ తదితరులు పాల్గొన్నారు.