నూరేళ్ళ పండగగా మొడియం వారి పెళ్లి సందడి

జనం న్యూస్/మే 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దాట్లవారిగూడెం గ్రామంలో మొడియం వారి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల క్రైమ్ నియంత్రణ విభాగ చైర్మన్ నడపాల సోమరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలతో చేసుకుంటారని, ఆ ప్రాంతంలో వీరు పాల్గొన్నారని అన్నారు. ఏజెన్సీలో పెళ్లిళ్లు ఆనవాయితీగా జరుపుకోవాలని, పెళ్లిళ్ల సందర్బంగా ఆదివాసీలు ఆడ, మగ కలిసి నృత్యాలు చేస్తూ పెళ్లిలో సందడి చేసుకుంటారన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో పెళ్లిళ్లు చాలా ముచ్చటగా ఉంటాయని అన్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, మొడియం శ్రీనివాసరావు,తెలంగాణ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు,హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఆదివాసి మెడికల్ & హెల్త్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సున్నం శ్రీరాముల దొర, కోరం ప్రసాద్,రెవిన్యూ డిపార్ట్మెంట్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *