అచ్చంపేట పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ విధానం పై అవగాహన సదస్సు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 అచ్చంపేట రిపోర్టర్(కొమ్ము రేణయ్య) అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కమ్యూనిటీ పోలీసింగ్ విధానం యొక్క ఆవశ్యకతను వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్ అనేది పోలీసులకు మరియు ప్రజలకు మధ్య నమ్మకాన్ని భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ నేరాలను తగ్గించడానికి, సామాజిక భద్రతను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక ఉమ్మడి వ్యూహం.ఇది కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా పోలీసు-ప్రజా సంబంధాలను బలపరిచి నేరాల నియంత్రణలో భాగస్వామ్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి నమ్మకాన్ని పెంపొందిస్తారు. స్థానిక సమస్యలు నేరాల గురించి ప్రజల నుండి పోలీసులకు సత్వర సమాచారం అందడం తద్వారా వేగం గా స్పందించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా స్నేహపూర్వకంగా పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని పోలీసులు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *