సాక్షి. డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గాడ్ మార్చి 15, కంటోన్మెంట్ లో చెత్త సేకరణ చేస్తున్న వాహనదారులతో కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ ,ఎమ్మెల్యే శ్రీగణేష్ , బోర్డు సి ఇ ఓ అరవింద్ కుమార్ ద్వివేది గారితో కలిసి మడ్ ఫోర్డ్ లోని కంటోన్మెంట్ వర్క్ షాప్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బానుక నర్మద మాట్లాడుతూ ముందుగా చెత్తను సేకరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాహనదారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి చెత్తను సేకరించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని వాహనదారులతో అన్నారు.
చెత్త సేకరణ వాహనదారుల అసోసియేషన్ కంటోన్మెంట్ బోర్డుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీ వాహనదారుడు 200 ఇళ్ళకు వెళ్ళి సేకరించాలని, 80 వాహనాలకు ఒప్పందం చేసుకుని 52 వాహనాలే తిప్పుతున్నారని, వెంటనే ఒప్పందం ప్రకారం వాహనాలను నడపాలని చెప్పారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా 160 వాహనాలు అవసరమైతాయని, కంటోన్మెంట్ బోర్డు కూడా మరిన్ని వాహనాలను పెంచి చెత్తను సేకరించాలని, ప్రజలు కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి రోడ్లపై చెత్తను వేయకుండా చూసేలా వారికి అవగాహన కల్పించాలని, శుభ్రత ఉంటే రోగాలు కూడా దరిచేరవని, వాహనదారులు విధంగా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని, వాహనదారుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని అన్నారు..ఈ సమావేశంలో హెల్త్, శానిటేషన్ సూపరింటెండెంట్ లు దేవేందర్, మహేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు అశుతోష్ చౌహాన్, పుష్పేందర్ గుప్త లు పాల్గొన్నారు.
