ములకలచెరువు మరియు బి. కొత్తకోట మండలాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్న జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్

సాక్షి డిజిటల్ న్యూస్ :15 మార్చి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్. అనంతరం భారీ కేక్ కట్ చేసి జనసేన పార్టీ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో మండల నాయకులు పూజారి సురేంద్ర, జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ పూల శ్రీనివాసులు, మారుజోళ్ళ సుదర్శన్, ఆవుల శంకర మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా బీ కొత్తకోట మండలంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బాబు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పోతుల సాయినాథ్ ఆప్యాయంగా పలకరించి వారి క్షేమ సమాచారాలు తెలుసుకొన్నారు. బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహిస్తున్నటువంటి తీరును పోతుల సాయినాథ్ ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకుని మెచ్చుకొన్నారు.దూరప్రాంతాల నుండి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆసుపత్రి ఎటువంటి అవసరాలను, సమస్యలను మా దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తానని మాటిచ్చారు వీలైనంతవరకు ప్రభుత్వం నుండి ఆసుపత్రికి కావలసిన లేటెస్ట్ మోడల్ ఎక్యూపమెంట్స్ అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు…..ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వీరమహిళలు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *