ఇష్టరాజ్యంగా డ్వాక్రా గ్రూప్ లీడర్లు పైసా వసూల్.

*డ్వాక్రా గ్రూపులో లీడర్లు ఏమి చెప్పిందే అదే వేదం.

అందోల్ మార్చి 15 సాక్షి డిజిటల్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) జోగిపేట లో పంచముఖి హనుమాన్ దేవాలయం వద్ద డ్వాక్రా గ్రూప్ మహిళలు కట్టెలతో పరస్పరధాలు చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా డాక్రా గ్రూపులకు డబ్బులు చెల్లించలేదని ప్రశ్నించినందుకు సభ్యులు పూర్తిగా ఇచ్చామని డాక్రా గ్రూప్ లీడర్ల మధ్య వాగ్దానం జరిగింది. ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్రా గ్రూప్ లీడర్లు పైసా వసూల్ చేయడంలో ఒకటికి రెండింతలు వసూలు చేసి తాము బ్యాంకులకు కట్టకుండా వారి సంసారాలకు గ్రూప్ సభ్యులు కట్టిన డబ్బులను వాడుకొని మీరు కట్టలేరు అని బెదిరిస్తున్నారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులందరూ తమ డబ్బులను ప్రతినెల జమ్మచేసి బ్యాంకులో కట్టి రమ్మని లీడర్లకు చెప్తే వారు మాత్రం తమ సొంత సంసారాలకు వాడుకొని మీరు కట్టలేరని మళ్లీ సభ్యులను బెదిరిస్తున్నారు. మేము డబ్బులు కట్టినారా అని అడిగితే మేము లీడర్లం కడుతాం మీరు ఎందుకు అడుగుతారు మళ్ళీ సభ్యులకు ఎదురు జవాబు సభ్యులకు ఇస్తున్నారు. ఇలాంటి మోసపూరితము చేస్తున్న లీడర్లను, మరియు సీఏలను గ్రూప్లో నుండి తొలగించాలని కొందరు మహిళలు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *