YS షర్మిలా రెడ్డి చేపట్టినటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న మూలం రెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, పులివెందుల, మార్చి:15 పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళా రెడ్డి చేపట్టినటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు అమలాపురం జిల్లా, పాయకారావుపేట నియోజకవర్గం, వెధర్లపాలెం నందు పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మూలం రెడ్డి ధ్రువ కుమార్రెడ్డి పాల్గొన్నారు. మూలం రెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ షర్మిల రెడ్డి చేపట్టినటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుందని వారి పోరాట ఫలితంగానే నేటి ప్రభుత్వాలు తీసుకొచ్చినటు వంటి కొత్త చట్టాలను మరో రెండు నెలలు వాయిదా పడిందని, నేడు కొనసాగుతున్నటువంటి ఉపాధి హామీ చట్టం ను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారని, Y S షర్మిల రెడ్డి చేపడుతున్నటువంటి సభలకు అశేష జనవాహిని తండోపతండాలుగా తరలివస్తున్నారని, రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తద్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *