ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీలో విద్యార్థులకు అవగాహన సదస్సు

*ట్రిబుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా

సాక్షి డిజిటల్ న్యూస్ ,వేంపల్లి, మార్చి:15( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఐహెచ్‌ఆర్‌పీసీ ఎన్జీవో ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కార్యాలయం మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్-1 సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొఫెసర్ కుమారస్వామి గుప్త ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కుమారస్వామి గుప్త మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వం అలవడుతుందని పేర్కొన్నారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జి. వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణతో కూడిన లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. సదస్సులో భాగంగా సైబర్ క్రైమ్, డిజిటల్ భద్రత, మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు వ్యక్తిగత ఆరోగ్యంపై నిపుణులు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుతూ, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ పి. రవికుమార్ , డీన్ ఆఫ్ అకడమిక్స్ డి. రమేష్ కైలాస్ , ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *