కామారెడ్డిలో నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ది …

*యువత కోసం జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగ, విద్యా, ఉపాధి, సామాజిక కార్యక్రమాలు - టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి …

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి:15, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగ, విద్యా, ఉపాధి, సామాజిక కార్యక్రమాలను ప్రారంభీస్తున్నామన్నారు. ఈ నెల మార్చ్ 22 వ తేదీన మేగా జాబ్ మేళాను కామారెడ్డి పట్టణ కేంద్రంలో కేంద్రంలో గల అశోక్ నగర్ కాలనీలో ఉన్న పార్శి రాములు కళ్యాణ మండపం వద్ద నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, ఇన్ఫర్మేషన్, హెల్త్, బ్యాంక్, అండర్ గ్రాడ్యూయేట్, బ్యాంకింగ్, ఫార్మసీ, సర్వీస్ సెక్టార్, మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పంతో ఈ పని చేస్తున్నామని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎస్సేస్సి, ఇంటర్, గ్రాడ్యూయేట్, పీజీ విద్యార్థులకు కామారెడ్డిలోనే ఉన్నత ఉద్యోగాలు సంబందించిన ఇంటర్వ్యూ నిర్వహించాలని ఉద్దేశంతో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 50 కి పైగా ప్రముఖ కంపెనీలు, కామారెడ్డి ప్రాంతంలోని వివిధ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నాంయాని, తద్వారా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈ పని చేస్తున్నామని అన్నారు. క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. యువతకు కామారెడ్డి నియోజకవర్గంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసామని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గడ్డం మీది మహేష్, మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, వంశీ, జూలూరి సుధాకర్,రంగ రమేష్ గౌడ్, సబ్బాని హరికృష్ణ, గంగారాములు, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్,రాశేఖర్, సునీల్, అరుణ్, ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *