రంజాన్ పండగ ప్రత్యేకత ఉపవాస దీక్షలు

*ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చాముండేశ్వరి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, మార్చ్ 15, రంజాన్ పండుగ ప్రత్యేకత ఉపవాస దీక్షలని వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో హజరత్ షేక్షావలి, హజరత్ షాషావాలి దర్గా సన్నిధానంలో రంజాన్ పవిత్ర మాసం లో కఠోర ఉపవాస దీక్ష ఉన్న ముస్లిం సోదరలకు సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ సకల జనుల క్షణం కోసమే ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారని అన్నారు.ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దరగప్ప, దాదావలి, రవి, షేక్షావలి, మెహబూబ్, జవీద్,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *