ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, మార్చ్ 15, మండల కేంద్రమైన హోళగుంద లోని జనసేన మండల కన్వీనర్ అశోక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక బస్టాండు నందు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసం ఎల్లప్పుడు ముందుం టుందని వారు తెలిపారు జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలాస వంతమైన జీవితం పక్కనపెట్టి ప్రజాక్షేత్రంలో రోడ్డుమీదికి రావడంతో ఎన్నో ఊర్లకు రోడ్లు వచ్చాయని ఉన్నారు. ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో దేశానికి తెలియజేసిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని అన్నారు.పార్టీ ఆశయాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన యువనాయకుడు వెంకటేష్, చిన్న,రవి,సహా పలువురు నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *