బండి సంజయ్ ఆశీర్వాద యాత్ర’లో అపశృతి….!

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేపట్టిన కరీంనగర్ నుండి కొండగట్టు దేవస్థానం వరకు ఆశీర్వాద యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్ర కొనసాగుతుండగా అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. బాధితులను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో స్వల్ప గాయాల పాలైన ఇద్దరిని డిశ్ఛార్జ్ చేయగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతు న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *