6.5 కిలోమీటర్లు రోడ్డుకు 4.5 కోట్ల నిధులు మంజూరు

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15, మండలంలో మూలపేట పంచాయతీ కుముర్లబంధ గ్రామానికి సరైనా రహదారి లేక ఎన్నో ఇబ్బందులు గురైతున్నా గిరిజన గ్రామ ప్రజలు దీనిపై స్పందించిన సర్పంచ్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గర్రెంగి రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మూలపేట పంచాయతీ శివారు గిరిజన గ్రామం కుముర్లబంద గ్రామ ప్రజలు సరైన రహదారి లేక ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నరు. దీన్ని పై స్పందించిన సర్పంచ్ రావుల వెంకట లక్ష్మి పీ ఎం జన్మన్ గ్రాంట్ పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్ ద్వారా రోలుగుంట మండలం ఆర్ల నుండి కొయ్యురు మండలం కుముర్లబంద వరకు సుమారు 6.5 కిలోమీటర్ల రోడ్డు పనులు ప్రారంభించమని ఆమె తెలిపారు.ఈ రోడ్డుకూ రూ.4.5 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బిడిజన అప్పారావు ప్రెసిడెంట్ రావుల వెంకటలక్ష్మి, మార్కెట్ డైరెక్టర్ జి రాజేశ్వరి,ఎక్స్ మార్కెట్ డైరెక్టర్ కిముడు శ్రీరాములు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఏ చలపతిరావు,గ్రామ యూత్ కమిటీ అధ్యక్షుడు డి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ డి రాజు,వీఆర్పీ ఆర్ సింహాచలం, జిసిసి డీలర్ వి సూరిబాబు,జి శిరీష పిషా కమిటీ డి రాజు,గ్రామ పెద్దలు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *