ఈపి ఆపరేటర్ల ఏ గ్రేడ్ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలి

* డీజీఎం పర్సనల్ రమేష్ కు వినతి పత్రం

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15, మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న : కొత్తగూడెం రీజియన్ స్థాయి ఈపి ఆపరేటర్ల ఏ గ్రేడ్ పదోన్నతుల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలనీ కోరుతూ మణుగూరు ఏరియా ఈపి ఆపరేటర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మణుగూరు ఏరియా డీజీఎం పర్సనల్ సలగల రమేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈపి ఆపరేటర్స్ నాయకులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం రీజియన్ స్థాయిలో అనగా మణుగూరు సత్తుపల్లి కొత్తగూడెం ఇల్లెందు ఏరియాలలో గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి బి గ్రేడ్ లో మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసిన అర్హులైన బి గ్రేడ్ ఆపరేటర్లు ఏ గ్రేడ్ పదోన్నతి పొందేందుకు సిద్ధంగా ఉన్నారనీ అర్హులైన ఆపరేటర్లకు పదోన్నతులు కల్పించేందుకు ఏరియా యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్ మొహమ్మద్ హాజీమియా, వనజర్ల సాయిబాబా మహబూబ్ జానీ, ఎండి తాజ్, భూక్య అంజయ్య, భానోత్ హాథిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *