మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ జనార్ధన్ రాథోడ్ ని పరామర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

సాక్షి డిజిటల్ న్యూస్, నిర్మల్ జిల్లా ప్రతినిది ( జునైద్ ఖురేషి ) మార్చి 15: నార్నూర్ మండలం భీంపూర్ లో మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ జనార్ధన్ రాథోడ్ మామ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు , నార్నూర్ మండలం విజయనగర కాలనికి వాసి కాంబ్లే అమిత్ అడ్వకేట్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారి కుటుంబాన్ని పరామర్శించారు, యువతకు అనేక రంగాల్లో అవకాశాలు ఉన్నాయని తొందరపడి ప్రాణాలు తీసుకోవడం బాధాకరం అన్నారు వారి తల్లితండ్రులను ధైర్యంగా ఉండాలని ఓదార్చారు . ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *