కాళేశ్వరం లో హనుమాన్ దీక్షలు

*సుమారు రెండు వందల మంది హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు *జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కాలేశ్వరం..

సాక్షి డిజిటల్ న్యూస్15 మార్చి 2026, మహాదేవపూర్ మండలం(తులసి మహేష్) జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన హనుమాన్ భక్తులు కాలేశ్వరం గ్రామంలో హనుమాన్ మాలధారణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాళేశ్వరంలోని రామాలయం దేవాలయంలో అర్చకులు దాదాపు రెండు వందల హనుమాన్ భక్తులు అర్ధమండల (21రోజుల..) దీక్షలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా అర్చకులు మాట్లాడుతూ హనుమంతుడు అంటే అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, మరియు వినయానికి నిలువెత్తు రూపం. ఆయన శివుని 11వ రుద్రావతారం, ఏడుగురు చిరంజీవులలో ఒకరైన ఆంజనేయుడు, శ్రీరామ కార్యసాధకుడిగా, బుద్ధిమంతుడిగా, మరియు భక్తుల కష్టాలను తొలగించే సంకటమోచనుడిగా కీర్తించబడతాడు అని అన్నారు. హనుమాన్ దీక్ష 21 రోజులు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ దీక్షను హనుమంతుడి అనుగ్రహం పొందడానికి చేస్తారు. 21 రోజుల పాటు చేసే ఈ దీక్షలో భక్తులు కొన్ని నియమాలను పాటిస్తారు. నియమాలు: శాకాహారం తీసుకోవడం, మంత్ర జపం, పూజలు చేయడం, హనుమాన్ చాలీసా పఠనం, సాత్విక జీవనం గడపడం, ఫలితాలు: హనుమంతుడి అనుగ్రహం, భయాలు, ఆందోళనలు తొలగిపోవడం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య వృద్ధి చెందడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *