బోరు మోటార్ ప్రారంభించిన కౌన్సిలర్ శిరీష నవీన్..

సాక్షి డిజిటల్ న్యూస్, (జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి కరుణాకర్ మెట్ పల్లి) మార్చ్ 15 2026 పట్టణంలోని బంటు పేట మాల సంఘ భవనంలో నూతన బోరు మోటార్ ను 14వ వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మాల సంఘ భవనంలో పాత బోర్ మోటర్ చెడిపోవడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్ నూతన మోటార్ ఏర్పాటు చేయగా శనివారం దానిని ప్రారంభించారు. అనంతరం బంటు పేట మాల సంఘ సభ్యులు, మహిళలు కౌన్సిలర్ దంపతులను సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బిట్లుగు కార్తీక్, కారం నరేష్, గుమ్మడి విక్రమ్, కంబ అశోక్,కంబ నాగరాజు, బొలుమల్ల సుమన్, కారం కిషోర్,బొల్లుమల కిరణ్ రాజేందర్, మహిళా సంఘ సభ్యులు దొంగేరి విజయ, పొట్ట లలిత, కారం రజినీ, లక్ష్మీ, రాసమొల్ల రాజమణి, బోల్ల మల్ల దివ్య , కారం అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *