6గురికి రూ.3,87,500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కె ఎస్ ఎన్ ఎస్ రాజు

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం మార్చి 14: ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ వైద్యం నుండి దూరం కావొద్దన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సహాయనిధి ద్వారా అర్హులైన ప్రతి బాధితుడికి తక్షణ ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారని చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు అన్నారు. మండలానికి చెందిన పలు గ్రామాల్లోని నిరుపేదలు వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్సల కొరకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఉన్నారు. వారి ఆర్థిక ఇబ్బందులు దృశ్య తమకు సహాయం అందించాల్సిందిగా ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ కార్డు ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు నేరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి పరిస్థితిని తెలియజేయడంతో వారికి వైద్య సహాయకు వచ్చిన నిమిత్తం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులలో K జువ్వలమ్మ చినపాచిలకు 1,25,000, K రాము చినపాచిల 37,500,
CH శివ కన్నంపేట 50,000, G రుక్మిణి కొత్తకోట 25,000, K నాగేష్ P. పోన్నవోలు 25,000, M రాజ్యలక్ష్మి Z.బెన్నవరం 1,25,000, మంజూరు కావడం ముఖ్యమంత్రి గారి ప్రజాహిత దృక్పథానికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం” అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గునూరు మల్లు నాయుడు,రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు,మండల పార్టీ అధ్యక్షులు శంకరరావు, సీనియర్ నాయకులు గోవింద,సర్పంచ్ గోకివాడ రమణ,మాజీ సర్పంచ్ అర్జున,మాజీ ఎంపీటీసీ బంటు శ్రీను,U.శ్రీను, నాగేశ్వరరావు,కోట సత్యనారాయణ,అంజి మరియు వివిధ హోదాలలో ఉన్న వివిధ గ్రామాల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శేషు రావికమతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *