గ్లాట్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఐఈఓ.

*జూనియర్ కాలేజ్ లెక్చరర్ సేవలకు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా…

సాక్షి డిజిటల్ న్యూస్: 15 మార్చి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. గెజిటెట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (GLAT) రిజి. నం. 985/2025 ఆధ్వర్యంలో…తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా నియమితులై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ పరిధిలో పని చేస్తున్న జూనియర్ కాలేజ్ లెక్చరర్ల సేవలకు సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా, ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్లాట్ అధ్యక్షురాలు రత్నకుమారి మరియు జిల్లా గ్లాట్ సభ్యులు.. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సముదాయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయానికి వెళ్లి డిఐఈఓ హెచ్. వెంకటేశ్వరావుని కలిసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్లాట్ వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, ఘనంగా వేడుకలు జరుపు కున్నారు. సంవత్సరం క్రితం 12 మార్చి 2025 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్న విషయాన్ని సభ్యులు స్మరించుకున్నారు. నియామక ప్రక్రియను వేగంగా, సాఫీగా పూర్తి చేసి 12 మార్చి 2025న నియామక ఉత్తర్వులు అందించినందుకుగాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్లాట్ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్లాట్ సంఘానికి సహకారం అందిస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేసే దిశగా మార్గదర్శనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్లాట్ సంఘం ప్రధాన కార్యదర్శి అమరపురి త్రినాధ్, కోశాధికారి హరీష్, సంఘం బాధ్యులు శ్రీనివాస్, సతీష్, హస్నత్, ప్రమీల, ప్రసాద్, సురేందర్,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *