ఒంటిపూట బడుల అమలుమరియు ఉపాధ్యాయుల హాజరు విధానం.. ఎంఇఓ సుందరరావు..

సాక్షి డిజిటల్ న్యూస్. 15 మార్చి.. అల్లూరి జిల్లా. డుంబ్రిగుడ. మండలం (పీతల. విలియంకేరి. రిపోర్టర్):ఈ నెల 16వ తేదీ నుండి 23వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి ఎస్.సుందరరావు తెలిపారు. 1 నుండి 9 తరగతుల వరకు ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పదవ తరగతి పరీక్షా కేంద్రాలు : పరీక్ష రోజుల్లో తరగతులు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు జరుగుతాయని
పరీక్షలు లేని రోజుల్లో సాధారణ పాఠశాల సమయాల ప్రకారం ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయని ఉపాధ్యాయుల ఫేషియల్ అటెండెన్స్ సూచనలు అటెండెన్స్ టైమింగ్:
ఉదయం 7:45 లోపల “ఇన్-టైమ్” నమోదు చేయాలని మధ్యాహ్నం 12:30 తరువాత “అవుట్-టైమ్” నమోదు చేయాలని వన్ సెక్షన్ సమయంలో సెలవులు: ఒంటిపూట బడులు అమలులో ఉన్న కాలంలో 1/2 డే క్యాజువల్ లీవ్ (1/2 సీఎల్) పెట్టరాదని అప్రూవ్ కూడా చేయరాదని ఎస్ఎస్సి పరీక్షల డ్యూటీకి వెళ్లే ఉపాధ్యాయులు, అటెండెన్స్ యాప్‌లో “ఎస్ఎస్సి డ్యూటీ” నమోదు చేయాలని ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని పరీక్షలు లేని రోజుల్లో పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని మండల విద్యాశాఖాదికారి ఎస్. సుందరరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *