సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీ ల పరిధిలో గల విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి ప్రాథమిక ఉన్నత పాఠశాల లో గత పది సంవత్సరాలుగా విద్యను అభ్యసించి ప్రస్తుత పదవ తరగతి పరీక్షలు 14 వ తారీకు రోజున ప్రారంభం అవడంతో మొదటి పరీక్షగా తెలుగు పరీక్షను విజయవంతంగా వ్రాయడం జరిగిందని వారి యొక్క తల్లిదండ్రులు మిత్రులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అధికారులు సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మామిడి విజయ్ తో తెలిపారు. ప్రశాంతమైన వాతావరణం లో విద్యార్థులు ప్రశ్నాపత్రంను సంపూర్ణంగా చదివి అత్యధిక మార్కులు వచ్చే విధంగా జవాబు రాస్తూ ఎక్కువ మార్కులు సాధించే దిశగా ఉండాలని మండలంలోని మేధావులు విద్యావంతులు తెలిపారు.