జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళతాం..

(సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మెట్పల్లి మండలం షేక్ అజ్మత్ అలీ) మార్చి 15 2026, జన సేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లి వారికి వివరిస్తామని పార్టీ నాయకులు తెలియజేశారు. శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మెట్ పల్లి పట్టణ శాఖ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం చెన్నకేశవ ఆలయంలో జన సేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి, కొత్త బస్టాండు పార్కు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి, అదేవిధంగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహించడం ద్వారా జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో తమ పార్టీ ముందుకు సాగుతోందని జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆయన చేసిన సామాజిక సేవ కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. సామాన్యుల పార్టీ గా, అవినీతి రహిత పాలన, మార్పు అనే నినాదంతో ముందుకు సాగుతున్న తమ పార్టీ కి ప్రజలు, యువకుల మద్దతు భారీగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది యువకులు, అభిమానులు స్థానిక రాధ్న్య బ్లడ్ బ్యాంక్ లో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దీంతో పాటు అయ్యప్ప ఆలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పలువురు నిరుపేదలకు అన్నదాన సేవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జన సేన నాయకులు ఎలగందుల అజయ్ కుమార్, బండి రమాదేవి, అబ్బూరి ఆనంద్ గౌడ్, పర్రె సంతోష్ కుమార్, రాంప్రసాద్, కడారి శ్రీకాంత్, కోటగిరి అరుణ్, రాకేష్, బుసవేని రమేష్,ఉదయ్, మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *